Thursday, June 20, 2013

About Our Village Dharmavaram, West Godavari

Dharmavaram ( ధర్మవరం) is a village near Kovvur, which is the mandal head quarters, in West Godavari District of Andhra Pradesh State, India. It has a population of around three thousand.

1 . ఉరి పేరు : ధర్మవరం
2. మండలం : కొవ్వూరు
3. జిల్లా :పచ్చిమ గోదావరి
4. దిక్కులు, సరిహద్దులు : తూర్పు న పంట పొలాలు , పడమర న కొండగూడెం , ఉత్తరం న మలకపల్లి , దక్షిణాన కాపవరం, పంగిడి , నైరుతి న గౌరిపట్నం, ఈశాన్యం లో సావరం, పెనకనమెట్ట , ఆగ్నేయం లో దొమ్మేరు , వాయువ్యం లో తిరుగుడుమెంత పొలాలు ఉన్నాయ్ .
5. ప్రధాన పంటలు : వరి , మొక్కజొన్న, పొగాకు , అరటి, మినుము, కందులు, పెసలు, కూరగాయ పంటలు, కొబ్బరి, చెరకు, మామిడి, ఆకుకూరలు.
6. పాటశలలు , కాలేజీ లు : జిల్లా పరిషత్ ఉన్నత పాటశాల , మండల పరిషత్ పాటశాల , స్వర్ణ భారతి పబ్లిక్ స్కూల్. అంగన్ వాడి స్కూల్స్ 
7. ఆలయాలు చరిత్ర : రామాలయం (100 సంవత్సరాల చరిత్ర ఉంది, బస్సు స్టాప్ దగ్గర )
శివాలయం ( 70 సంవత్సరాల ముందు కట్టారు స్కూల్ దగ్గర )
దుర్గ దేవి ఆలయం ( హాస్పిటల్ దగ్గర , 50 సంవత్సరాల చరిత్ర ఉంది )
ముత్యాలమ్మ అమ్మ వారి ఆలయం ( శతాబ్దాల చరిత్ర , బస్సు స్టాప్ మరియు చెరువు వెనకాల )
అన్జినేయస్వామి ఆలయం ( హాస్పిటల్ దగ్గర , 50 సంవత్సరాల చరిత్ర ఉంది ) ,
పురాతన విష్ణు ఆలయం (చెరువు దగ్గర) ,
సుబ్రహ్మణ్య ఆలయం (చెరువు దగ్గర),
సాయి బాబా టెంపుల్ ( హాస్పిటల్ దగ్గర ) ,
ఇంకా చర్చి లు కలవరి, పెంతెకోస్తు, బాప్తిస్తూ ....
8. ఉరి ప్రత్యేకతలు : మా ఉరి లో అందరి మద్య సోదర భావం ఉంటుంది... అందరు కలసి సమస్య మీద పోరాడతారు .. ప్రదానం గ , మా ఉరి లో ఒక ప్రైవేటు హాస్పిటల్ ( రెబ్బపగడ రామ కృష్ణ హాస్పిటల్ ), వాటర్ ప్లాంట్, రైస్ మిల్లు , మీ సేవ సెంటర్ , ఆంధ్ర బ్యాంకు, సోసిటీ బ్యాంకు, ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్ , ప్రైవేటు స్కూల్ , పిండ ప్రదనాలకు భవనం, మంచి నీటి చెరువు , చాకలి చెరువు, చపల చెరువు, ఇంటీరియర్ డోర్ ఫ్యాక్టరీ , ఉన్నాయ్ . ప్రదానం గ అన్ని రాజకీయ పార్టీ లు ఉన్నాయ్ .
ఇంకా ఎందఱో దేశ విదేశాల లో ఇండస్ట్రీ లు , పరిశ్రమలు నెలకొల్పి ఎంద్దరికో ఉపాది ఇస్తున్నారు... ప్రతి సంక్రాంతి కి మా వురి లో అందరు ఒక చోటికి చేరి పండగ జరుపుకుంటారు.. ఇందులో సంక్రాంతి సంబరాలు ముక్యమినవి... గణేష్ యూత్ వారు గత కొన్ని సంవత్సరాల నుండి వినాయక చవితి ఘనం గ జరుపుతూ ఉంటారు.. అలాగే దసరా కూడా చాల బాగా చేస్తారు... ఇలా చెప్పు కుంటూ పోతీ ఎన్నో .....
10. ప్రయాణ సౌకర్యం : రాజమండ్రి నుండి 15 కిలోమీటర్ల దూరం, పోలవరానికి 15 కిలోమీటర్లు , గోపలపురం కి 18 కి మీ , నిడదవోలు కి 15 కి మీ, కొవ్వూరు కి 10 కి మీ . దూరం లో ఉన్నది మా వూరు . బస్సు సౌకర్యం, రాజమండ్రి నుండి , కొవ్వూరు నుండి , నిడదవోలు నుండి , జంగారెడ్డిగూడెం నుండి ప్రతి 30 ని కి ఒక బస్సు ఉంది... ఏలూరు - కొవ్వూరు రూట్ లో కాపవరం జంక్షన్ నుండి 3 కి మీ దూరం లో ఉంది మరియు కాపవరం నుండి తాళ్ళ పూడి నుండి ఆటో సౌకర్యం ఉంది. దగ్గరగా కొవ్వూరు రైల్వే స్టేషన్, రాజమండ్రి స్టేషన్, చాగల్లు, నిడదవోలు స్టేషన్ ఉన్నాయ్.. రాజమండ్రి లో అన్ని సూపర్ ఫాస్ట్, ఎక్ష్ ప్రెస్ , పాసెంజర్ రైల్స్ కి హాల్ట్ ఉన్నాయ్..