వేదంలా ఘోషించే మా గోదావరి ...
నీటితో పాటు అందంగా రాలి మెరిసే వడగళ్లని ఎప్పుడైనా చప్పరించారా ? పంట కాలువ నీళ్లు దోసిలితో పట్టి తాగేంత స్వచ్ఛమని మీకెప్పుడైనా అనిపించిందా ? ఇటు పక్కన వరి… దాని పక్కన చెరుకు… అటు అవతల మొక్కజొన్న… అది దాటితే మామిడి… ఇంతటి వైవిధ్యం కనిపించే చోటు చూశారా ? పనసపొట్టు కూరంటే పడిచచ్చిపోవడం… పులస చేప తింటే తెలుస్తుంది మజా అనడం మీరు విన్నారా ఎపుడైనా ? మాటల్లో బారా మూరా… చేతల్లో పట్టువిడువు…చేసే పనుల్లో అదోరకం ఒడుపు ఒక చోట చూస్తే…గాలి మన రెక్కపట్టి పచ్చదనంలోకి తీసుకెళ్లిపోతుందని తెలిస్తే… మీకు గోదావరి జిల్లాలతో సాంగత్యం ఉన్నట్టే. ఈ సంగతులన్నీ తెలిసినట్టే !
గోదారి దాదాపు 1400 కిలోమీటర్ల పొడుగున ప్రవహిస్తుంది. ఈ వంద నూటయాభై కిలోమీటర్లకే ఇంత ప్రత్యేకత ఎందుకు ? ఏముందంత గొప్ప ? వర్షం ఊరంతా… సముద్రం నిండా పడుతుంది. మరి చిప్పలో పడిందే ముత్యమెందుకవుతుంది ? ఎందుకంత మురిపిస్తుంది ? అని అడిగితే సమాధానం ఏం చెబుతాం… ఇదీ అంతే !
గోదారి ఒడిలో ప్రకృతి….
కరక్టే ! ప్రకృతి ఒడిలో గోదారి కాదు. గోదారి ప్రాంతాలు, రాష్ట్రాలు దాటొస్తుంది. కానీ ఇక్కడున్నంత అందంగా ఇంకెక్కడా లేదేమో అనిపిస్తుంది. భద్రాచలంలో రాములోరి పాదాలు కడిగిన ఉత్సాహమో…లేదంటే వాలు పెరిగి, వీలు కుదిరిన ఆనందమో నిండుదనంతోపాటు లోతు కూడా కనిపిస్తుంది. అందుకే రెండు గోదావరి జిల్లాల్ని మధ్య పాపిటలా విడదీస్తూ లంకల్ని కలుపుతూ కోనసీమను ఒరుసుకుంటూ వెళ్లే గోదారమ్మంటే ఇక్కడ కన్నతల్లి. ఊళ్లూ బీళ్లు గుండా ప్రవహించి… సస్యశ్యామలం చేసే నదులుంటాయ్. విజృంభించి విలయం సృష్టంచే నదాలూ కనిపిస్తాయ్. కానీ గోదావరి మూడోతరహా ! సరస్వతీ నది భూఅంతర్భాగంలో ప్రవహించినట్టు..గోదావరి నిండు జీవితాలతో పెనవేసుకొంటుంది. వరవడితో ఆ జీవితాల్లో జీవం నింపుతుంది. అంతర్వాహినిలా ఆహ్లాదం పంచుకుంది.
పచ్చని కొబ్బరాకుల్ని నారింజ రంగు నంజుకున్నట్టు తూరుపు తెల్లారింది మొదలు… గోదావరి జిల్లాల్లో ప్రకృతికి రూపాలెన్నో ! సైకిలెక్కి తరలిపోయే అరటి గెలలు… భూమి మీద ఇంద్రధనస్సులా కనిపిించే కడియం నర్సరీలు… కొలనులో కలువల్లాంటి లంకగ్రామాలు… ఆధునికతను అద్దుకున్నట్టు అనిపించే కాకినాడ తీరం… ఇటు కొసకొస్తే… కొంగల కొల్లేరు తీరం. పంట తోటల పశ్చిమ గోదారి మెట్ట అక్కడికి ఇంకాస్త దూరం. రహస్యంలా కనిపించే ఏజెన్సీ ప్రాంతం… వైవిధ్యం తలెత్తినట్టుగా ఉండే జగ్గంపేట కొండగుట్టలు. చెప్పుకుంటూ పోతే గజానికో సొగసు… ఏనాటితో ఈ తపసు అనిపిస్తుంది గోదావరి ప్రత్యేకతలను ఆస్వాదిస్తుంటే… !
సిరుల గోదారి…
చెప్పుకోదగ్గ పరిశ్రమ లేదు గ్యాస్ తప్ప. జరిగిపోయే గొప్ప వ్యాపారమేం లేదు కాకినాడ హార్బర్ మినహా ! అందని వాటి కోసం అర్రులు చాచింది లేదు… ప్రభుత్వాలు దోచిపెట్టిందీ లేదు. అయినా దేశ పల్లె సీమల్లోనే కోహినూర్ ఉభయ గోదావరి. సిరి సంపదలు తులతూగడంలోనో ఆనందాలతో అలరారడంలోనే కాదు… ఆలోచనాస్థాయి…మానసిక పరిపక్వతలోనూ ఏ వన్ మన గోదారి తీరం. అభిమానం తన్నుకొచ్చి వేస్తున్న వీరతాడు కాదు ఇది. ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులర్ సైన్సెస్ లెక్క.. సంపాదనతో సంతోషంగా ఉన్నామని చెప్తున్న జనం ఇక్కడ 90 శాతం పైనే ! చదువుకున్న వాళ్ల గట్టిగా మూడొంతులు లేకపోయినా ఉద్యోగాలు చేస్తున్న జనం రెండు మూడు పర్సెంట్ మించకపోయినా ఈ ప్రాంతంలో సంతోషమే సగం బలం అందీ రిపోర్ట్. ఇది ఏడాదిన్నర కిందటి మాట. ఇంత ఉత్సాహానికి ఒకే ఒక్క కారణం గోదావరి.
అవును. గోదావరంటే పారే నదో… ధవళేశ్వరం ఆనకట్టో… కోనసీమ కాళ్లు కడిగే సీనరీనో మాత్రమే కాదు. అంతకు మించి. సస్యశ్యామలం చేయడమే కాదు బతుకుల్ని తీర్చిదిద్దే నదులు ప్రపంచ పరిణామ చరిత్రలోనే ఒకటో రెండో ! ఒకప్పటి నైలు ఈజిప్ట్ నాగరికతకి ఉగ్గుపాలు పడితే ఇప్పటి గోదావరి సజీవ సంస్కృతికి జీవం పోస్తోంది. ఆహారం, ఆహార్యం, అలవాట్లు, ఆర్థికం, పంటలు, పండగలు, సరదాలు, సంబరాలు… ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కోటి మంది జీవితాలపై గోదావరి ముద్రలు అనంతకోటి.
గోదావరంటే భోళాతనం… గోదావరంటే కల్మషం కనిపించని చోటు. మంచి తనానికి గుప్పిడెక్కువ. పంచ్ తనానికి బెత్తెడు తక్కువ. మెరుపుండే విరుపు… కదిలించే కవ్వింపు. ఇవన్నీ కలిస్తే గోదావరి వెటకారం. గోదావరోళ్లం కదండీ ఆ మాత్రం వెటకారం ఉంటుందంటూ చెప్పుకునే తీరు స్వచ్ఛతని పట్టిస్తుంది. అండి అంటూ కలిపే మాటే గోదావరి తొలి ముద్ర. వీటన్నిటితోపాటు కదిలించే ఆప్యాయతలు, కలిసొచ్చే పెద్దరికాలు ఇక్కడ కావాల్సినన్ని ! పండక్కదరా.. ఆ మాత్రం చేయకపోతే మాటొచ్చేద్దని వచ్చా, మనిద్దరం కలిసిచేద్దారని…అంటూ సందర్భం ఏదైనా కలుపుకొని పోయే మాటలు కావాల్సినన్ని వినిపిస్తాయ్. మనసుకి పట్టిన మకిలి వదలకొడతాయ్. మావవ సంబంధాలు ఇంకా బతికున్నాయ్ అని… మనుషుల గుండెల్లో ఇంకా తడి ఉందని చెప్పేందుకు మిగిలిన కొన్ని ప్రాంతాల్లో గోదావరిది ముందువరస. మనుల్లో తడి అంటున్నామే… ఆ తడి ఉద్ధృతమై నదిలా ప్రవహిస్తే గోదావరి అవుతుందండి.
ఘమఘుమల గోదారి…
క్రియేటివిటీకి నేటివిటీ తోడైతే ఎలా ఉంటుంది ? అచ్చం గోదావరి వంటల్లాగా ! అయినా కొత్త రకం వంటలు చేయాలంటే నింపాదిగా ఉంటే లైప్ స్టైల్ తప్పనిసరి. అందులోనూ ఆలోచన ఉండగానే సరిపోదు… దానికి కళాపోసన కావాలి. వచ్చిన ఆలోచని అమల్లోకి తేవాలి. అలా తెచ్చింది కాబట్టే గోదావరి కొత్త రుచుల పట్టుకొమ్మ. తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకులు, కోడి గుడ్డు పెసరట్టు, గుడ్డిపీతల పుసులు… రొయ్యల గారెలు, కోడి మాంసం ఇగురు ఇలా చెప్పుకుంటూ పోతే గోదారికే ఘుమఘుమలు అద్దుతాయ్ ఉభయగోదారి వంటలు. ఇవి ఇక్కడి కేరాఫ్. వీటికితోటు… వేరుపనస పళ్లు… పొట్టు పనస కూరలు… కొట్టుకొచ్చే పులసలు… జీడిపప్పు దిగదుడుపనిపించే రొయ్య బిర్యానీలు… అహో తినాలే గానీ చెప్పకూడదు. చెప్పినా విని ఊరుకోకూడదు. అసలు ఆంధ్రా భోజనం అనే మాట గోదారి గట్టున పుట్టిందా ? నిజమేనని ఒప్పుకుంటే గొడవ లవుతాయ్. అహ్హహ్హహ… !
బతక నేర్చిన గోదారి…
నిజానికి బతుకు నేర్పిన గోదావరి అనాలేమో ! ఆలోచనలు తట్టిలేపి… సున్నితత్వాన్ని నేర్పి… కళాత్మకంగా తీర్చిదిద్దడంలో గోదావరిది నంబర్ వన్ ర్యాంక్. ఆకలేసి తిండిలేక అర్థరాత్రి గోదారి ఒడ్డుకు చేరితే ఆలోచనలు దారిమళ్లేవి. ఇసకలో కాలుకదులగుతుండగానే బుర్రలో వేయి మెరుపులు మెరిసేవి. నా బాధలు మర్చిపోయి కొత్త గాధలు కథకథలుగా రాసిన కాగితాలు నా గదినిండా… మది నిండా పరుచుకున్నాయంటాడు వంశీ ! లోతుగా చెప్పాడు గానీ కవ్వించే కవితలు…కళతెచ్చిన కావ్యాలు…తీర్చిదిద్దిన కళాఖండాలు…ఖండాంతరాలు దాటిన సినిమాలు తీసిన కళాకారులు అందరికీ ఒకటే అడ్డా… గోదారి గట్టు !
నాగరాజు రాత్రి మా ఇంటికొచ్చేడు… ఇది కథ టైటిల్. ఆ… వస్తే ఏంటి అని తేలిగ్గా తీసేయలేం… ఏమైనా జరగొచ్చు… ఎన్నైనా జరగొచ్చు ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలుగు సాహిత్యంలో ఓ పేజీ అయి కూర్చుంటుంది ఎందుకంటే అది గోదారి. తెలుగింటి పసితనానికి గొడుగు పట్టే బుడుగులు, సంగీత కళానిధులు, సాహితీ దురంధరులు, వాణిజ్య విశారదులు, సంఘానికి సంస్కరణనేర్పిన ఆర్యసమాజ కర్తలు, అన్వేషకులు అన్నిటికీ మించి వెండితెరకి మహా రాజపోషకులు అందరూ గోదావరి వాస్తవ్యులే ! మడిసన్నాక కూసింత కళాపోసనుండాలన్న మాట పొడిచిందిక్కడే ! అయినా ఎన్ని చెప్పుకున్నా… వీటన్నిటి వెనక కనిపించే కామన్ థ్రెడ్ గోదావరి. సినిమాలు చూడ్డం… పందేలు ఆడ్డం… పండగలు చేయడం అన్నీ గోదావరి నేటివిటీ. తప్పుగా అనుకోవద్దు… అంతేనా అని తేల్చేయొద్దు… ఒక్క మాటలో తెలుగు లోగిలి గిలిగింతలకి కేరాఫ్ కోనసీమ, గోదారి సీమ. జీవితం అవతలి గట్టు చూడాలంటే గోదారి ఈదాలి. ఇదొక్క మాట చాలు.
నింపాదిగా… నిశ్చిలంగా… గోదారిలా… వేదంలా…
వేదంలా ఘోషించి..అమరథామంలా తీరాన్ని తీర్చిదిద్ది, బతుకునేర్పి…బంధాలు మిగిల్చి, నిమిత్త మాత్రులాలినన్నట్టు..నిశ్చలంగా సాగరసంగమంలోకి సర్దుకుంటుంది గోదావరి. అది అంతర్వేది అయినా.. గౌతమీకోరింగలు కలిసిన యానాం అయినా సారాంశం ఒక్కటే! ఈసంగమం సమాప్తం కాదు. వచ్చినపని పూర్తిచేసుకొని అంతరాత్మలో ఐక్యమయ్యే అద్వైతంలా అనిపించే అరుదైన దృశ్యం. ఇది హత్తుకునే ఘట్టం. ఇన్ని మాటలెందుకు గోదారిని… చూసి మథించి అనుభవించి ఆస్వాదించాల్సిందే తప్ప చెప్పేది కాదు. ఎందుకంటే… గోదారిని కడవలో కెత్తలేం… పడవలో దాటలేం … వాక్యాల్లో ఇరికించలేం. గోదారి జీవితకాల అనుభవం. జన్మజన్మల సారం.
-
Our Dharmavaram

గోదావరి జిల్లాల ప్రజలు స్నేహశీలురు, గౌరవమర్యాదలు తెలిసున్నవాళ్ళు. అలాగని అమాయకులని మాత్రం అనుకోవడానికి వీలులేదు. `ఆయ్` అని మర్యాద చూపిస్తూనే, తమమర్యాద ఏమైనా తగ్గుతుందని భావిస్తే చమత్కారంగా మాటకి మాట అప్పజెప్పగల చతురులు. ఏ పరిస్థితులలో అయినా నెగ్గుకురాగల వ్యవహారధక్షత కూడా వీళ్ళకు ఎక్కువే. "ఏమిటి, గోదావరి వాళ్ళ వకాల్తా పుచ్చుకొన్నట్టు, అంతలేదు, ఇంతలేదు అని కోతలు కోస్తున్నావ్? వాళ్ళకేనా సుగుణాలు? ఇంకెవరికీ ఉండవా?" అని వాదనకి రావద్దు. ఎందుకంటే, ఈ ప్రాంతపు ప్రజలతో నాకు ఉన్న స్నేహం అపూర్వం. చాలా సంవత్సరాలుగా వాళ్ళ సహవాసం. అదే మీతో స్నేహం ఉండుంటే, మీగురించే చెబుతానుకదా? అర్ధం చేసుకోరూ!