పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు.
అవిసె గింజలు-నూనె , Linseed-Oil (Or) FLAX SEEDS
- ఉపయోగాలు:
- గోధుమరంగు ఫ్లాక్స విత్తనాలు:
- పోషక విలువలు ఏ విధంగా ఉన్నాయంటే... 100 గ్రా (3.5)
- ఉత్పాదకత 2,234కెజె (534కెకాల్)
- కార్బొహైడ్రేట్లు 28.88గ్రా
- చక్కెర 1.55గ్రా
- పీచు పదార్థం 27.3గ్రా
- కొవ్వు 42.16గ్రా
- ప్రొటీన్స్ 18.29గ్రా
- విటమిన్ బి1 1.644ఎంజి (143%)
- విటమిన్ బి2 0.161ఎంజి (13%)
- విటమిన్ బి3 3.08ఎంజి(21%)
- విటమిన్ బి5 0.985ఎంజి (20%)
- విటమిన్ బి6 0.473 ఎంజి (36%)
- విటమిన్ బి9 (0%)
- విటమిన్ సి 0.6ఎంజి (1%)
- కాలిషియం 255ఎంజి (26%)
- ఐరన్ 5.73 ఎంజి (44%)
- మాగ్నీషియం392ఎంజి(110%)
- పాస్పరస్642ఎంజి(92%)
- పొటాషియం 813ఎంజి(17%)
- జింక 4.34ఎంజి(46%)
- ఆరోగ్యాన్నిచ్చే ఆహార పదార్థాలను ఏదైనా ఇష్టంగా తినాలి. కష్టంగా మాత్రం తినొద్దు. రోజువారీ ఆహారంలో అవిసె గింజల్ని భాగం చేసుకుని తినేవారి ఆరోగ్యం ఎక్కువ కాలం సురక్షితంగా ఉంటుంది. ఇందుకు సాక్ష్యం పాతతరం వారు. ఆ రోజుల్లోనే అవిసెగింజలతో చిట్కా వైద్యాలు ఎన్నో చేశారు మన పెద్దవాళ్ళు. ఎముకల అరుగుదల, జాయింట్ పెయిన్స్‌తో బాధపడేవారు అసె గింజలను ఆహార పదార్థాలతో పాటు తీసుకుంటే ఈ రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. వీటిలో ఉండే ఒమేగా యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా కొలెస్టరాల్ స్థాయిలు చాలా వరకూ తగ్గుతాయి.
అల్లము , Ginger
పండ్లు , కాయగూరలు ,గింజలు పప్పులు , కందమూలాలు , మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము . ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును .అన్నం తో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదేఅసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం. ఒక చిన్న మొక్క వేరునుండి తయారవుతుంది ..ఇది మంచి ఔషధంగా కూడా పని చేస్తుంది. ఇది భారతదేశం మరియు చైనా దేశాలలో చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని శతాబ్దాల నుంచీ చైనీయుల వైద్యంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది. కన్ఫ్యూషియస్ తన రచనల్లో దీనిగురించి ప్రస్థావించాడు. ఆసియా దేశాల్లో చేసే చాలా వంటకాల్లో ఇది విడదీయలేని భాగం. పచ్చళ్ళలోనూ, కూరల్లో వేసే మసాలా లోనూ దీన్ని విస్తృతంగా వాడుతారు. ఎండాకాలంలో వడకొట్టకుండా, అల్లంను కరివేపాకు, మజ్జిగలతో కలిపి తీసుకుంటారు. చాలామందికి ప్రయాణాల్లో వాంతులు మహా ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని అల్లంతో అరికట్టవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్యులు. అల్లం నోటి దుర్వాసనను పోగోడుతుంది. అల్లం నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియాలను సంహరించి, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం అల్లానికి ఉంది. అల్లం ప్రభావం కాలేయం మీద ఉంటుంది. కొలెస్టరాల్ నియంత్రణలో మెరుగైన పాత్ర వహించేలా కాలేయాన్ని తయారు చేయడమే అల్లం నిర్వహించే పాత్ర. రక్త నాళాల్లో రక్తప్రవాహం మెరుగుపరుస్తుంది. నాళాలు మూసుకుపోవడం జరుగదు. కీళ్లవారు, ఆస్త్మాల నుండి ఉపశమనం అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అల్లం, చిటికెడు ఉప్పును భోజనానికి ముందుగానీ, తర్వాతగానీ తీసుకుంటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అల్లం మలబద్ధకాన్ని పోగొడుతుంది. సులభ విరోచనకారి కూడా. కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది.
అల్లం ఉపయోగాలు:
- మొదటి ముద్దగా అన్నంలో శొంఠిని పలుచగా కలిపి నేతితో తింటే, అజీర్తి పోతుందని నమ్మకం
- బాలింతరాలుకు శరీరము గట్టి పడేందుకు, వేడి కలిగేందుకు శొంఠిని విస్తృతంగా వాడుతారు
- పిల్లలకు అజీర్ణం తగ్గేందుకు చాలా తక్కువ మోతాదులో దీనిని వాడుతారు.
- ఆయుర్వేద మందులలో ఇది ఎక్కువ కనిపిస్తుంది.
- అల్లం మంచి యాంటి ఆక్షిడెంట్ గా పని చేస్తుంది .
- రక్త శుద్దికి తోడ్పడుతుంది .
- రక్తం రక్త నాళాల లో గడ్డకట్టనీయకుండా సహాయపడుతుంది .
- అల్లం కొన్ని వారాలపాటు వాడితే .. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి .
- అల్లం వల్ల కడుపులో పూత (అల్సరు) ఏర్పడదు .
- అల్లము నోటి దుర్వాసనను పోగొడుతుంది . . నోటిలో చేరిన ప్రమాదక బ్యక్టీరియల్ను సంహరించి , దంటాలను ఆరొగ్యము గా ఉంచుతుంచి .
అరటి పువ్వు , Plantain flower
- అరటి శాస్త్రీయ నామము "plantae musaceae musa" . ఇది అన్ని దేశాలలో దొరుకును .
- అరటి పువ్వు గుండె రూపం లో ఉంటుంది , మన ప్రాంతం లో కొంతమంది అరటిపువ్వును ఒక కురగాయగాపరిగనిస్తారు . అరటిపువ్వును సలాడ్ గా , సూప్ లాగా తాయారు చేసి వాడుతారు . కొన్నిగిరిజన ప్రాంతాలలోఅరటిపువును ఎండా బెట్టి ,పొడిచేసి .. దానితో చపాతీలు చేసుకుంటారు .
ఉపయోగాలు :
- అరటి పూవు జీర్ణ క్రియ తేలికగా జరిగి సుఖ విరోచనము అగును .
- ఇందులోని ఐరన్ ,కాల్సియం , పొటాసియం, మెగ్నీషియం , ఫాస్ఫరస్ , వగైరాలు నాడీ వ్యవస్థ మీద ప్రభావంచూపి సక్రమము గా పనిచేసేటట్లు దోదాపడును .
- ఇందులోని విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని అభివృద్ది చేయును .
- ఆడువారిలో బహిస్తుల సమయం లో అధిక రక్తస్రావము అరికట్టడానికి ఇది పనికొచ్చును .
- మగవారిలో వీర్య వృద్ధికి దోహద పడును .
అరటి పండ్లు , Banana
పండ్లు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు ,కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతివైద్యుల నమ్మకం .
ప్రపంచం మొత్తంమీద మన దేశం అరటిని పండించే విషయంలో రెండో స్థానంలో ఉంది. ఎంతోమంది రైతులకు, వ్యాపారస్థులకు ఇది ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఆర్థిక వెసులుబాటును కల్గిస్తూ బాసటగా నిలుస్తోంది.
ఉపయోగాలు
- అరటి ఒక చెట్టులా కనిపించే మొక్క (నిజం చెప్పాలంటే ఇది ఒక హెర్బ్ మాత్రమే). ఇది మూసా అను ప్రజాతికి, మరియూ మూసేసి కుటుంబానికి చెందినది. కూర అరటి కి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది . అరటి చెట్టు కాండము, చాలా పెద్ద పెద్ద ఆకులతో (సుమారుగా రెండు నుండి మూడు మీటర్లు పొడుగు) నాలుగు నుండి ఎనిమిది మీటర్లు ఎత్తు పెరుగును. అరటి పండ్లు సాధారణంగా 125 నుండి 200 గ్రాములు బరువు తూగుతాయి. ఈ బరువు వాటి పెంపకం, వాతావరణము, ప్రాంతముల వారీగా మారుతుంది. ఈ బరువులో 80% లోన ఉన్న తినగల పదార్థము, 20% పైన ఉన్న తోలు.
- * అరటి పండులో నీటి శాతం కంటే ఘన పదార్థం శాతం ఎక్కువ. ఇవన్నీ శరీరాన్ని పోషించే పదార్థాలు కావటంతో దీనిని కేవలం పండుగానే కాకుండా ఆహారంగా సైతం వాడుకోవచ్చు.
- * నూట యాభై గ్రాముల మేక మాంసంలోను, సగానికి కోసిన కోడిగుడ్డులోను, నాలుగొందల గ్రాముల ఆవుపాలలోను ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి కేవలం, ఒక మోస్తరు పొడవున్న అరటి పండులో ఉంటుంది. పెరిగే పిల్లలకు, వృద్ధులకు వ్యాధులనుంచీ కోలుకునే వారికి దీనిని సమర్థవంతమైన ఆహారౌషధంగా ఇవ్వవచ్చు.
- * అరటి పండు పైనుండే దళసరి తోలు సూక్ష్మక్రిములను, విష పదార్థాలను అడ్డుకొంటూ, రక్షక కవచంగా పనిచేస్తుంది. దీనిని ప్రయాణాలలోను, ఇతర అనుచిత ప్రదేశాల్లోనూ నిర్భయంగా తినవచ్చు.
- * మధుమేహ రోగులు ఇతర పిండి పదార్థాలను తగ్గించుకోగలిగితే, అరటి పండును తినడంలో అభ్యంతరమేదీ లేదు. (ఒక మోస్తరు సైజున్న అరటిపండునుంచి సుమారు 100 క్యాలరీల శక్తి విడుదల అవుతుంది. కాగా మధుమేహం నియంత్రణలో ఉన్న వారికి, శారీరకావసరాలకు, రోజుకు సుమారు 1600 క్యాలరీల శక్తి అవసరం అవుతుంది. ఈ శక్తిని దృష్టిలో ఉంచుకొని అరటి పండును తీసుకోవటంలో తప్పులేదు).
- * అరటి పండులో కొవ్వు పదార్థం చాలా అల్పమోతాదులో ఉంటుంది. ఈ కారణంచేత దీనిని కామెర్లలోను, ఇతర కాలేయపు వ్యాధుల్లోను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. (కాలేయం వ్యాధిగ్రస్తమైనప్పుడు కొవ్వును జీర్ణంచేసే ఎంజైముల విడుదల తగ్గిపోతుంది.)
- * అరటి పండులో పొటాషియం మోతాదు చాలా ఎక్కువ. దీనిని కిడ్నీ ఫెయిల్యూర్‌లో వాడకూడదు. (ఈ వ్యాధిలో మూత్రపిండాలు పొటాషియంను సమర్థవంతంగా బయటకు విసర్జించలేవు. ఫలితంగా రక్తంలో పొటాషియం మోతాదు ప్రమాద భరితమైన స్థాయిలో పెరిగిపోతుంది. అరటి పండ్లు అధికంగా తింటే ఇది మరింత పెరుగుతుంది.)
- * ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం అరటి పండు కఫాన్ని పెంచుతుంది. దగ్గు, జలుబు, ఆస్త్మా వంటి కఫ ప్రధాన వ్యాధుల్లో దీనిని వాడటం మంచిది కాదు.
- * అరటి పండు తిన్న తర్వాత ఏలక్కాయ తింటే కఫ దోషం తగ్గుతుంది. లేదా అరటి పండు తినేటప్పుడు రెండు లవంగాలను గాని, మూడు మిరియాలను గాని గుజ్జుతోపాటు తిన్నా సరిపోతుంది.
- 74% కన్నా ఎక్కువగా నీరు ఉంటుంది.
- 23% కార్బోహైడ్రేటులు, ~
- 1% ప్రోటీనులు,
- 2.6% ఫైబరు ఉంటుంది.
- * నీరు - 70.1 గ్రా.
- * ప్రోటీన్ - 1.2 గ్రా.
- * కొవ్వుపదార్థాలు - 0.3 గ్రా.
- * పిండిపదార్థాలు - 27.2 గ్రా.
- * కాల్షియం - 17 మి.గ్రా.
- * ఇనుము - 0.4మి.గ్రా.
- * సోడియం - 37 మి.గ్రా.
- * పొటాషియం - 88 మి.గ్రా.
- * రాగి - 0.16 మి.గ్రా.
- * మాంగనీసు - 0.2 మి.గ్రా.
- * జింక్ - 0.15 మి.గ్రా.
- * క్రోమియం - 0.004 మి.గ్రా.
- * కెరోటిన్ - 78 మైక్రో గ్రా.
- * రైబోఫ్లెవిన్ - 0.08 మి.గ్రా.
- * సి విటమిన్ - 7 మి.గ్రా.
- * థయామిన్ - 0.05 మి.గ్రా.
- * నియాసిన్ - 0.5 మి.గ్రా.
- * శక్తి - 116 కిలోకాలరీలు
- * దీనిలో అత్యధికంగా ఉండే పొటాషియం బీపీ, అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
- * శరీరంలోని విషపదార్థాల (టాక్సిన్స్)ను తొలగిస్తుంది.
- * అరటిపండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్‌గా మారి ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుందని చెబుతారు.
- * అరటిపండులోని పొటాషియం శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. డైటింగ్ చేస్తున్నవాళ్లు ఒకపూట భోజనం లేదా టిఫిన్ మానేసి అరటిపండు, వెన్న తీసిన పాలు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి.
- * జీర్ణసంబంధమైన సమస్యలకూ అరటిపండు మంచి ఔషధంలా పనిచేస్తుంది. జబ్బుపడినవాళ్లు దీన్ని తింటే తొందరగా కోలుకుంటారు.
- * పచ్చి అరటి కాయలు విరేచనాలనూ, పండిపోయినవి మలబద్ధాన్నీ అల్సర్ల నూ అరికడతాయి.
- * అరటిపండ్లలో కణోత్పత్తిని ప్రోత్సహించే గుణం, జీర్ణాశయం గోడలకున్న సన్నటి పొర నాశనం కాకుండా కాపాడుతుంది.
- * అమెరికాలో పాయిజన్ ఐవీ (poison ivy) అనబడే చెట్లు చర్మానికి తగిలిన వచ్చే ఓ రకమైన చర్మ వ్యాధిని అరటిపండు తోలు లోపలి భాగంతో రుద్ది నయం చేస్తుంటారు
- * అరటికి ఎయిడ్స్ వైరస్‌పై పోరాడే శక్తి ఉంది.అరటిలోఉండే 'బాన్‌లెక్' అనే రసాయనం ఎయిడ్స్ వైరస్‌పై శక్తిమంతంగా పోరాడుతుందని తేల్చారు. ప్రస్తుతం వైరస్ నిరోధానికి వాడుతున్న 'టీ20, మారావిరాక్' మందులతో సమానంగా ఈ రసాయనం పని చేస్తుంది..అరటిలోని లెక్టిన్ రసాయనం వైరస్‌ను శరీరంలో ప్రవేశించనీయకుండా అడ్డుకుని ఇన్‌ఫెక్షన్‌ను నిరోధిస్తుంది. ఈ రసాయనం ప్రొటీన్‌పై పరచుకుని హెచ్‌ఐవీ జన్యుపదార్థం మూసుకుపోయేలా చేస్తుంది.
- * అమ్మాయి పుట్టాలని కోరుకునే గర్భిణులు అరటిపళ్లు తినడం మానేయాలి.
- అందానికీ ఆరోగ్యానికీ అరటి మంచి నేస్తం. పెరట్లో పండే, అందుబాటు ధరలో దొరికే అరటితో ఎన్నిరకాల లాభాలున్నాయో చూడండి.
- * అజీర్ణాన్ని తగ్గించడంలో, కడుపులోని అల్సర్లను మాన్పించడంలో అరటి తోడ్పడుతుంది.
- * అరటిలో ఉండే పొటాషియం నరాలను ఉత్తేజపరచి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతుంది. దీనిలోని పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తాయి.
- * డయేరియాను తగ్గించడంలో అరటి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది చెడ్డ బాక్టీరియాను మంచి బాక్టీరియాగా మార్చుతుంది.
- * ఒక అరటి పండుతో 95 క్యాలరీలు అందుతాయి. అంతేకాదు దీనిలోని పొటాషియం శరీరంలోని నీటి నిల్వల్ని కాపాడుతుంది. దీనిలో విటమిన్ బి6, కాల్షియం, జింక్ ఫోలిక్ ఆమ్లం, పీచు పుష్కలంగా ఉంటాయి.
- * అరమగ్గిన అరటిలో క్యాలరీలు తక్కువగా ఉండి శక్తి వినియోగాన్ని క్రమబద్ధీకరిస్తుంది.
- * రెండు అరటి పండ్లు, ఒక గుడ్డు, గ్లాసు పాలు, రెండు టేబుల్ స్పూన్ల తేనె కలిపి బనానా షేక్ తయారుచేసి ఉదయాన్నే తాగితే బలహీనంగా ఉన్నవారు బరువు పెరుగుతారు.
- * బాగా పండిన అరటి పండును పెరుగులో కలిపి తింటే వైట్ డిశ్ఛార్జ్ సమస్యను దూరం చేస్తుంది. అరటి పువ్వును ఉడికించి పెరుగుతో కలిపి తింటే రుతుచక్రం సమయంలో నొప్పినీ రక్తస్రావాన్నీ తగ్గిస్తుంది.
- * చిన్నపాటి కాలిన గాయాలను మాన్పించే గుణం అరటిగుజ్జుకు ఉంది.కనిపించింది.
అనాస (PINEAPPLE)
ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఫలాలు ఎన్నో ఉన్నాయి. అందులో అనాస పండు ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. అనాస ఒక రకమైన పండ్ల చెట్టు. ఇది మామూలు చెట్ల మాదిరిగా కాక భూమి నుండి పెద్దగా విడివడిన పచ్చని కలువ మాదిరిగా ఉంటుంది. దీని ఆకులు పొడవుగా ముళ్ళతో సున్నితంగా ఉంటాయి. ఇది దక్షిణ అమెరికాలోని ఫిలిప్పైన్స్‌లో పుట్టింది. అయితే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో పెరుగుతుంది. దీని ఉత్పత్తిలో హవాయి రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పైనాపిల్ ఉత్పత్తిలో 60% వాటా హవాయిదే. అమెరికన్ ఆదివాసులు ఈ పండు అంటే బాగా ఇష్టపడతారు. వారు దీన్ని దేవతా ఫలంగా భావిస్తారు. తాజా పండ్ల రూపంలోనే కాకుండా స్క్వాష్‌లు, జామ్‌లు, సిరప్‌లు, కార్డియల్స్ రూపంలో దీనిని మార్కెట్ చేస్తున్నారు. భారతదేశంలోకి ఇది 1548 సంవత్సరంలో ప్రవేశించింది. అప్పటి నుంచి దీని సాగు దేశీయంగా మొదలయ్యింది. మన దేశంలో ఈశాన్య రాష్ట్రాలలో పైనాపిల్‌ను పండిస్తారు. బహువార్షిక గుల్మము. దీని శాస్త్రీయ నామం ఎకోమోసస్. వృక్షశాస్త్రం ప్రకారం అనాస్ ఎకోమోసస్ అని..పిలుస్తారు. ఇది బ్రొమేలియా జాతికి చెందింది.
- వర్షాకాలంలో విరివిగా దొరికే పండ్లలో పైనాపిల్ ఒకటి. పుల్లగా తియ్యగా ఉండే పైనాపిల్‌లో పొటాషియం, సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన రాకుండా మనల్ని కాపాడతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల్ని దూరం చేస్తాయి. పైనాపిల్‌లో 'సి' విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు, క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. దీనిలోని బ్రోమెలెయిన్ ఎంజైమ్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇంతే కాదు చర్మ నిగారింపును పెంచే మరెన్నో ఎంజైమ్‌లు పైనాపిల్‌లో ఉన్నాయి.
- దీన్ని తింటే 48 కిలో కాలరీల శక్తి వస్తుంది.
- కార్బోహైడ్రేట్స్ 12.63గ్రా్ప్పలు,
- కొవ్వు పదార్ధం 0.12%,
- కాల్షియం 1%,
- ప్రొటీన్లు 0.54 గ్రా్ప్పలు,
- చక్కెర శాతం 9.26గ్రా్ప్పలు,
- ఐరన్ 2% ఇన్ని పోషక పదార్ధాలు ఇందులో మిళితమై ఉన్నాయి. ఇందులో ప్రొటీన్ల శాతం కూడా ఎక్కువగా ఉంది.
- థైమిన్ (విటమిన్ బి1) 6%,
- రైబోఫ్లెవిన్ (విటమిన్ బి2) 2%,
- నైసిన్ (విటమిన్ బి3 ) 3%,
- పాన్‌థోతెనిక ఆసిడ్ (విటమిన్ బి5) 4%,
- విటమిన్ సి 60%,
- పొటాషియం 2%
- ఈ పండును తింటే శరీరంలోని జీర్ణ శక్తిని పెంచుతుంది.
- రక్త నాళాల్లో రక్తం గడ్డకట్ట కుండా కాపాడుతుంది.
- ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది.
- పండిన అనాస పండును తింటుంటే పళ్ళ నుండి రక్తంకారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది.
- పూర్తిగా పండని అనాస రసం తీసు కుంటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
- జ్వరం, కామెర్ల వంటి అనారోగ్యాలలో ఉన్న వారికి అనాస రసం ఇవ్వడం ఎంతో మంచిది. అనాస పండును ఆహారంగా తీసుకోవడం అందరికీ తెలిసిందే! కానీ అందచందాలను ఇనుమడింపజేసే శక్తి కూడా ఎక్కువగా ఉంది.
- అనాసపండు రసాన్ని ముఖాని కి రాసుకుని మర్థన చేస్తే ముఖ చర్మం కోమలంగా, అందంగా మారుతుంది. పండులోని ఎంజైములు ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి. అంతే కాకుండా నల్లటి మచ్చలను తొలగిస్తుంది.
- అనాసలోని ఎంజైమ్స్ వాపులను, నాసికా సంబంధమైన వ్యాధుల ను, టైఫాయిడ్‌ని ఉప శమనం చేస్తుంది.
- ఇది అర గడానికి రెండు గంటలు పడుతుంది. పండని అనాసకాయ తింటే అరగడం చాలా కష్టమవుతుంది. దీనితో విరేచనాలు అవుతాయి.
- బాగా పండిన అనాస రసం శరీర తాపాన్ని తగ్గిస్తుంది. అదనపు శక్తిని కూడా కలిగిస్తుంది. ఈ పండులో ఉన్న కొన్ని ఎంజైమ్స్ కారణంగా జీర్ణశక్తి పెరిగి జీర్ణాశయానికి చక్కగా పని చేస్తుంది.
- ఈ పండులో అధికమైన పీచుపదార్థం మలబద్దకానికి మంచి మందుగా పని చేస్తుంది.
- అనాసలో సమృద్ధిగా పొటాషియం ఉండడం వల్ల కొన్ని మూత్రపిండాల వ్యాధులలో మూత్ర ప్రక్రియ సరిగా లేని వారికి చక్కటి ఫలితాలను ఇస్తుంది.
- పచ్చి అనాసకాయ రసం తెగిన గాయాలపై వేస్తే రక్త స్రావం అరికడుతుంది.
- గ్లాసు అనాస పండు రసంలో పంచదార కలిపి సేవిస్తే వేసవిలో అతి దాహం అంతరించి వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.
- పొగ తాగడం వల్ల శరీరానికి సంభవించే అనర్ధాలు తగ్గిపోతాయి.
- తాజా అనాస పండు రసాన్ని గొంతులో పోసుకుని పుక్కిలిస్తే గొంతునొప్పి, టాన్సిల్స్ నివారణ అవుతాయి.
- గజ్జి, దురద ఉన్నవారు అనాస రసం పైపూత మందుగా వాడితే మంచి గుణం కనిపిస్తుంది.
- పచ్చ కామెర్ల కాలేయ వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు, కొన్ని రకాల గుండెజబ్బులు ఉన్నవారు ప్రతిరోజు అనాసరసాన్ని తాగుతే మంచి ఫలితాలని స్తాయి.
- పచ్చి అనాస రసాన్ని తెగిన గాయా లపై వేస్తే రక్తస్రావం అరికడుతుంది.
- అనా సరసాన్ని పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులున్నవారు ప్రతిరోజు ఈ రసాన్ని తాగితే మంచి ఫలితాలన్ని ఇస్తుంది.
Fig fruits (Anjeera fruit)
ఆరోగ్యానికి అంజీర ఫలము : కొంచెం వగరు.. కొంచెం తీపి .. కాస్త వులువు ఉండే అంజీర్ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సీమ మేడిపండుగా వ్యవహరించే ఇది శారీరక అవస్థలను దూరము చేసే పోషకాలను అందిస్తుంది. విరివిగా లభించే అంజీర్ పచ్చివి, ఎండువి ఒంటికి చలువ చేస్తాయి. • అంజీర ఫలం లో కొవ్వు, పిండివదార్థాలు, సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి. ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. పాలు, పాల వదార్థాలు పడని వారు వీటిని పది నుంచి వన్నెండు చొవ్పున తీసుకుంటే శరీరానికి క్యాల్షియం, ఇనుము అందుతాయి. • కడువులో ఆమ్లాల అసమతుల్యత తలెత్తకుండా చేస్తుంది. పేగువూత, కడువులో మంట, అజీర్తి సమస్యతో బాధవడేవారు తరచూ తీసుకుంటే ఎంతో మేలు. దీనిలోని పొటాషియం గుండెకు ఉవకరిస్తుంది. రక్తవ్రసరణ సక్రమముగా జరగడానికి తోడ్పడుతుంది. దేహ వుష్టికి ఉవకరిస్తుంది. • అతి ఆకలితో బాధవడే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి.. ఈ పండు చక్కటి ఆహారము . దీనిలోని ఇనుము, క్యాల్షియం, పీచు వంటి వాటికి ఆకలిని తగ్గించే గుణర ఉంది. చక్కెర వ్యాధి గలవారు కూడా వీటిని కొంచెంగా తీసుకోవచ్చు. • నోటి దుర్వాసన గలపారు భోంచేశాక ఒకటి రెండు పండ్లు తీసుకుంటే ఎంతో మంచిది. కడువులో వాయు ఆమ్లాలని తగ్గించి అన్నం అరగడానికి దోహదవడుతుంది. వీటి పైతొక్క గట్టిగా ఉరటుంది. త్వరగా అరగదు కాబట్టి నీటిలో కాసేవు ఉంచి తొక్క తీసి తింటే మంచిది. • సూవర్ మార్కెట్లలో దొరికే బాగా ఎండిన అరజీర్‌లలో మినరళ్లు అధికం. అవి మలబద్ధకాన్ని దూరము చేస్తాయి. తలనొవ్పి, కీళ్లనొవ్పులు, కడువులో మంట గలపారు వుల్లటి పండ్లను తీసుకుంటే పడకపోవచ్చు. అలాంటి వారు ఈ ఎండిన వండ్లకు ప్రాధాన్యం ఇప్వొచ్చు. • దీనిలోని ట్రైప్టోఫాన్స్ చక్కగా నిద్ర వట్టడానికి సాయవడతాయి. ఎలర్జీ దగ్గు, కఫం గలపారు ఈ వండ్లను తినడం వల్ల సానుకూల గుణం కనివిస్తుంది. మేడివండు గొంతు ఇన్ఫెక్షన్, కఫాన్ని తగ్గిస్తుంది. • రక్తాల్పత, మొలలు కలవారు రోజుకి రెండు మూడింటిని తీసుకుంటే త్వరగా ఉవశమనం కలుగుతుంది. ఈ పండులో ఉండే 'పెక్టిన్' అనే వదార్థము కొవ్వును అదువులో ఉంచుతుంది. • ఒంటిమీద గడ్డలు, కురువులకు ఈ వండు గుజ్జును వూతగా వేసి ఉంచితే, అవి త్వరగా పక్వానికి వచ్చి పగులుతాయి. సలపరింవు తగ్గుతుంది. • అన్ని మేడివండ్లు ఒకే రుచిలో దొరకవు. మనకు విరివిగా లభించే అంజీర్ తరహా మాత్రం కొంచెం తీవి, వగరుగా ఉంటాయి. పులువు మరీ ఎక్కువగా ఉన్నవ్పుడు తక్కువగా తీసుకోపాలి. లేదంటే పళ్లమీద ఎనామిల్ పొర తగ్గుతుంది. మరీ ఎక్కువ తిన్నాము అనివిస్తే విరుగుడుగా కాస్త జీలకర్ర నోట్లో పేసుకుంటే సరి.
వంద గ్రాముల వండ్లలో పోషకాలు

పిండి వదార్థం - 19 గ్రా,
అత్తి పండు తియ్యని రుచి గల పండు. దీనిని విరిచి తిన వచ్చు. అత్తి పండు విరిచినప్పుడు లోపల సన్నని పురుగులు ఉంటాయి కనుక జాగ్రత్తగా విలించి తింటారు. ఈ పండు రక్త పుష్టి కలిగిస్తుంది. అరోగ్యానికి మేలు కలిగిస్తుంది.
అత్తి పండ్ల చెట్లు దక్షిణ భారతదేశంలో అంతగా కనిపించవు. ఉత్తర భారతదేశంలో విరివిగా కనిపిస్తాయి. అత్తిపండుకు ఆరోగ్యరీత్యా చాలా ప్రాధాన్యత ఉంది. మెత్తగా, తియ్యగా, మధురంగా ఉండే ఈ పండులో అన్నీ మంచి గుణాలే. అన్నీ ఆరోగ్యాన్ని పెంచే లక్షణాలే. అయితే మెత్తగా ఉండటంవల్ల దీనికి పండిన తరువాత త్వరగా చెడిపోయే లక్షణం ఉంటుంది. దీనితో సాధారణంగా దీనిని ఎండబెట్టి డ్రైఫ్రూట్ రూపంలో వాడుతుంటారు. దీనిలో మాంసకృత్తులు, కొవ్వు, పిండి పదార్థాల వంటివి అల్పమోతాదులో ఉంటాయి. పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎండబెట్టిన తరువాత దీనిలో ఔషధ విలువలు పెరుగుతాయి. ముఖ్యంగా చక్కెర శాతం ఎండబెట్టిన పండులో 50నుంచి 75 శాతం వరకూ ఉంటుంది. దీనిని నేరుగా గాని, లేదా ఇతర ఆహార పదార్థాలతో కలిపి గాని తీసుకోవచ్చు. పిండి పదార్థాలను తీసుకోవటంవల్ల మలబద్ధకం ఏర్పడుతుంటే, ఆ పదార్థాలతోపాటు అత్తిపండ్లను కలిపి తీసుకుంటే సరిపోతుంది. అత్తిపండ్లను పాలతో కలిపి తీసుకోవచ్చు. అత్తిపండ్లను కేకుల తయారీలోను, జాముల తయారీలోనూ వాడతారు. దీనిని దీర్ఘవ్యాధులనుంచి త్వరగా కోలుకోవడానికి వాడవచ్చు.
ఎలా వాడాలి?
అత్తి పండ్లను వాడబోయేముందు బాగా కడగాలి. ఎండు పండ్ల తోలు గట్టిగా ఉంటుంది. నానబెట్టినప్పుడు మెత్తబడుతుంది. అయితే, దీనిలోని విలువైన పదార్థాలన్నీ నీళ్లలోకి వెళతాయి. కనుక పండ్లను నానబెట్టిన నీళ్లతోసహా తీసుకోవాలి.
మాత్ర (డోస్): స్వరసం (జ్యాస్) 10-20మి.లీ. గుజ్జు: 5-10 గ్రా.
వివిధ భాగాలు, శాస్ర్తియ అధ్యయనం
పండు: మృధువిరేచకం (ల్యాగ్జేటివ్), ఎక్స్‌పెక్టోరెంట్ (కఫాన్ని పల్చన చేసి వెలుపలకు తెస్తుంది)
పండు గుజ్జు: అనాల్జెసిక్ (నొప్పిని తగ్గిస్తుంది) యాంటిఇన్‌ఫ్లమేటరి (ట్యూమర్స్, గమ్ యాబ్సిస్) (వాపును తగ్గిస్తుంది)
నిర్యాసం (లేటెక్స్): అనాల్జెసిక్ (నొప్పిని తగ్గిస్తుంది), టాక్సిక్ (పులిపిరులు, కీటకాల కాటుకు వాడవచ్చు).
ఆకు: బొల్లిమచ్చలకు వాడవచ్చు.
చెట్టుపట్ట: ఎగ్జిమా, ఇతర చర్మవ్యాధుల మీద పనిచేస్తుంది.
నిర్యాసం (గమ్): యాంజియో టెన్సిన్ 1 కన్వర్టింగ్ ఎంజైమ్‌మీద వ్యతిరేకంగా పోరాడే మూడురకాల పెప్టైడ్‌లను అత్తిపండ్ల నిర్యాసంలో కనుగొన్నారు. ఇవి రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి.
వివిధ వ్యాధుల్లో ప్రత్యేక ప్రయోగ విధానం
వ్రణశోథ: పండును చీల్చి, గుజ్జును వేడిచేసి నోటి చిగుళ్లమీద తయారయ్యే వ్రణం మీద లేపనం మాదిరిగా ప్రయోగించాలి.
మలబద్ధకం: అత్తిపండ్లలో అధిక మొత్తాల్లో సెల్యులోజ్ అనే పదార్థం ఉంటుంది. అలాగే దీనిపైన గట్టి తోలు ఉంటుంది. వీటివల్ల, వీటిని మలబద్ధకంలో వాడవచ్చు. అత్తిపండ్లలో ఉండే చిన్నచిన్న గింజలు పేగుల్లోపలి గోడలను సున్నితంగా ఉత్తేజ పరుస్తాయి. ఫలితంగా పేగుల కదలికలు పెరిగి మలం సజావుగా కిందవైపుకు ప్రయాణిస్తుంది. అలాగే పేగులను శుభ్రంగా ఉంచుతుంది.
అర్శమొలలు: అత్తిపండ్లు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి కనుక వీటిని మూలవ్యాధితో బాధపడేవారు వాడుకోవచ్చు. ఒక ఎనామిల్ పాత్రను వేడి నీళ్లతో శుభ్రపరిచి చన్నీళ్లు తీసుకొని మూడునాలుగు ఎండు- అత్తిపండ్లను రాత్రంతా నానేయాలి. ఉదయం పూట నాని ఉబ్బిన పండ్లను తినాలి. ఇలాగే మళ్లీ రాత్రి పడుకోబోయే ముందు చేయాలి. ఇలా రెండుమూడు నెలలపాటు క్రమం తప్పకుండా చేస్తే మూలవ్యాధి తగ్గుతుంది. మలనిర్హరణ సమయంలో ముక్కాల్సిన అవసరం రాదు. మూలవ్యాధి తీవ్రంగా ఉన్న వారిలో కొంతమందికి పెద్ద పేగు జారే అవకాశం కూడా ఉంది. ఇలాంటి వారికీ ఇది బాగా పనిచేస్తుంది.
ఉబ్బసం: కొంతమందికి శ్వాస మార్గాల్లో కఫం పేరుకుపోయి గాలి పీల్చుకోవటం కష్టమవుతుంది. ఇలాంటివారు అత్తిపండ్లను వాడితే కఫం తెగి శ్వాస ధారాళంగా ఆడుతుంది. అలుపు, అలసటలు తగ్గి శ్వాసకు ఉపకరించే కండరాలు శక్తివంతమవుతాయి.
శృంగారానురక్తి తగ్గటం: అత్తిపండ్లు దాంపత్య కార్యంలో పాల్గొనేవారికి నూతనోత్తేజాన్ని ఇస్తాయి. బలహీనతను పోగొట్టి శృంగారానికి సన్నద్ధం చేస్తాయి. వీటిని నేరుగా గాని లేదా బాదం, ఖర్జూరం వంటి ఇతర ఎండు ఫలాలతోగాని వాడుకోవచ్చు. వెన్నతో కలిపి తీసుకుంటే వీటి శక్తి ఇనుమడిస్తుంది.
ఆనెలు: పచ్చి అత్తిపండ్ల మీద గాటు పెడితే పాల వంటి నిర్యాసం కారుతుంది. దీనిని ఆనెల మీద ప్రయోగిస్తే నెమ్మదిగా ఆనెలు మెత్తబడి పై పొరలు ఊడిపోతాయి. పచ్చి అత్తికాయల నిర్యాసానికి నొప్పిని తగ్గించే తత్వం ఉంది.
నోటిలో పుండ్లు: అత్తిపండ్లనుంచీ కారే పాల మాదిరి నిర్యాసాన్ని స్థానికంగా ప్రయోగించాలి.
శరీరంలో వేడి: బాగా పండిన తాజా అత్తిపండ్లను 2- 3 తీసుకొని మిశ్రీతో కలపాలి. వీటిని రాత్రంతా పొగమంచులో ఆరుబయట ఉంచాలి. ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. దీనిని 15రోజులపాటు చేయాలి.
బలహీనత: చాలామందికి శారీరక బలహీనతవల్ల నోటిలో పుండ్లు, పెదవుల పగుళ్లు, నాలుకు మంట వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటివారు అత్తిపండ్లను తీసుకుంటే హితకరంగా ఉంటుంది.
- వీచు వదార్థాలు - 3 గ్రాములు,
- చక్కెర - 16 గ్రాములు,
- కొవ్వు - 0.3 గ్రాములు,
- ప్రొటీన్లు - 0.8 గ్రా,
- విటమిన్ 'బి6' - 110 గ్రా,
- శక్తి - 70 కిలో.కె.
- పిండివదార్థాలు - 84 గ్రాములు,
- చక్కెర - 48గ్రాములు,
- వీచువదార్థం - 10 గ్రాములు,
- కొవ్వు -0.3 గ్రాము,
- ప్రొటీన్లు - 3 గ్రాములు.

చాలా విలువైన సమాచారం. ధన్యవాదాలు. - అవిసె గింజల గురించి మరికొన్ని వివరాలు - https://www.healthclues.net/blog/te/flax-seeds-in-telugu/
ReplyDelete