Monday, May 2, 2016

Kaasi Yatra started from Our Dharmavaram

నిన్న ( 1st May 2016 ) సుమారు గా 100 మంది మన ధర్మవరం నుండి కాశి ( వారణాసి ) యాత్రలకు బయల్దేరినారు . విజయవాడ కనకదుర్గ అమ్మ వారి దర్శనం తో మొదలైన ఈ యాత్ర వారణాసి మీదుగా నేపాల్ వరకు జరుగును. సుమారు గ 15 రోజులు పాటు జరిగె ఈ యాత్రలో ఇంచు మించు గ అన్ని వయసుల వారు ఉండటం విశేషం . యాత్రలో ఉన్న వారు దయ చేసి యాత్రలో మీరు సందర్సన కోసం ఎక్కడికి వెళ్ళినా సరే మీ పక్క వారికి చెప్పి వెళ్ళండి, తప్పిపోయిన వారు కంగారు పడకుండా మీ దగ్గరలోని సమాచార కేంద్రాల వద్దకు వెళ్లి మీ సమాచారం ఇవ్వండి , ఆరోగ్యం బాగోలేని వారు మీరు ఉపయోగించే మందులు, మంచి నీరు , ఆహార పదార్దాలు, మొబైల్ ఫోన్స్ మొదలగు సామగ్రి వెంట ఉంచుకోండి.
ఈ యాత్ర లో భాగం గా వీరు అలహాబాద్ , త్రివేణి సంగమం, కాశి విశ్వనాధ్, కాశి అన్నపూర్ణ , కాశి విశాలాక్షి కాశి లోని వివిధ ఘాట్ లు, గంగా హారతి , కాల భైరవ మందిరం, గయా , బుద్ద గయా ,సీతా మడీ ,వింధ్య చలం, అయోధ్య , నైమిశారణ్యం , కోణార్క్, పూరి ,సాక్షి గోపాల్, భువనేశ్వర్, కలకత్తా బేలుం మటమ్ , కాళీ మందిరం ,విక్టోరియా పాలస్ , నేపాల్ పశుపతి టెంపుల్ మొదలగు ప్రదేశాలు , దేవాలయాలు సందర్శిస్తారు .
మీ ప్రయాణం సుఖమయం, విజయవంతం అవ్వాలని,
క్షేమం గా వెళ్లి లాభం గా రావాలని కోరుకుంటూ మీ Our Dharmavaram _/\_ మన ధర్మవరం_/\_



No comments:

Post a Comment