Solution for white hair
చిన్నవయసులోనే కొంతమంది యువతీయువకులకి తలలో తెల్ల వెంట్రుకలు వస్తుంటాయి. ఇలాంటి పిల్లలు తెల్లబడిన జుట్టుతో బయటకు వెళ్లాలన్నా, నలుగురితో కలిసి తిరగాలన్నా బాగా మొహమాటపడతారు. తమ వెంట్రుకల రంగు చూసి ఎవరు నవ్వుతారో...వెక్కిరిస్తారోనని భయపడుతుంటారు. చాలా ఇబ్బందిపడుతుంటారు. ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. చిన్నతనంలోనే తెల్ల వెంట్రుకలు రావడానికి కారణాలు లేకపోలేదు. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, తీవ్రమైన ఒత్తిడితో కూడిన జీవనశైలి వంటి వాటి వల్ల జుట్టు తెల్లబడుతుంది. ఇవే కాకుండా వయసు మీద పడ్డా కూడా నల్లగా ఉన్న జుట్టు కాస్తా తెల్లబడుతుంది. దీనికి కారణం జుట్టును నల్లగా ఉంచే మెలొనిన్ ఉత్పత్తి శరీరంలో తగ్గిపోవడమే. ఈ తెల్లజుట్టు కనిపించకుండా కొన్నిరకాల టిప్స్ , ట్రిక్స్ ఉన్నాయి. అవి చిన్నాపెద్దా అందరికీ ఉపయోగపడతాయి. ఉదాహరణకు శిరోజాల్లో ఏవో కొన్ని పాయలు తెల్లగా ఉన్నాయనుకోండి ఆ ప్రాంతంలో కొద్దిగా మస్కారా రాసుకుంటే జుట్టులోని తెల్లదనాన్ని మస్కారా కవరప్ చేస్తుంది. ఇది ఇన్స్టాంట్ కిటుకు. అలాగే కాజల్‌ని కూడా తెల్ల వెంట్రుకలపై పూస్తే జుట్టు నల్లగా నిగ నిగలాడుతూ కనిపిస్తుంది. డార్క్ బ్రౌన్ లిప్‌స్టిక్‌ను కూడా తలలోని తెల్ల పాయాలపై అప్లై చేయొచ్చు. ఇవే కాకుండా ఇంట్లో వస్తువులతో కూడా తెల్లజుట్టు సమస్యను అధిగమించవచ్చు. ఎలా అంటారా?
ఉదాహరణకు 100 మిల్లీ గ్రాముల కొబ్బరినూనెలో గుప్పెడు కరివేపాకు ఆకులు వేయాలి. ఆ రెండింటిని కలిపి బాగా ఉడకబెట్టాలి. కరివేపాకు ఆకులు నల్లరంగులోకి మారిన తర్వాత దానిని పొయ్యి మీద నుంచి దించాలి. అది చల్లారిన తర్వాత దాన్ని బాగా పిండి అందులోంచి వచ్చిన ఆయిల్‌ని ఒక సీసాలో పోసి గట్టిగా మూతపెట్టాలి. ఈనూనెను ప్రతి రోజూ రాత్రిపూట తలకు రాసుకుని 20 నిమిషాలు పాటు మర్దనా చేసుకొని, ఆ మర్నాడు తలస్నానం చేయాలి. జుట్టును నల్లగా ఉంచడంలో ఉసిరి, నిమ్మ కూడా ఎంతో బాగా పనిచేస్తాయి. ఒక టీ స్పూన్ ఉసిరిపొడిని కప్పు నీళ్లల్లో కలిపి స్టవ్‌పై పెట్టి అది సగానికి వచ్చేవరకూ ఉడకనివ్వాలి. తర్వాత దానిని స్టవ్ మీద నుంచి దించి అందులో మూడు టీస్పూన్ల నిమ్మరసాన్ని కలపాలి.

ఈ మిశ్రమానికి కొంత నీరు కలిపి తలకు బాగా రుద్దుకుని నీళ్లతో కడిగేసుకోవాలి.
అలాగే నువ్వుల నూనె కూడా జుట్టు నల్లగా నిగ నిగ లాడేలా చేస్తుంది. వంద మిల్లీగ్రాముల నువ్వుల నూనె, 100 మిల్లీ గ్రాముల కమలాపండు రసం, 50 గ్రాముల మెంతుల పొడిని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మూడు వారాల పాటు సూర్యరశ్మి కింద ఉంచాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలకు పెట్టుకుంటే జుట్టుకున్న తెల్లదనం పోతుంది. హెన్నాతో సైతం ఈ సమస్యను అధిగమించవచ్చు. హెన్నా పొడిని పేస్టులా చేసి అందులో కాస్తంత కాఫీ పొడి, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఆ పేస్టును తలకు రాసుకుని రెండు గంటల సేపు అలానే ఉంచుకోవాలి. ఆ తర్వాత షాంపుతో తలరుద్దుకుని, నీళ్లతో జుట్టును శుభ్రంగా కడిగేసుకోవాలి. ఉడకబెట్టిన తేయాకు ఆకులతో వెంట్రుకల తెల్లదనాన్ని పోగొట్టుకోవచ్చు. తొలుత తేయాకు ఆకుల్ని నీళ్లల్లో ఉడకబెట్టాలి. అది చల్లారిన తర్వాత ఆ ఆకుల్ని పిండి దాని నుంచి వచ్చే నీటిని తలకు రాసుకోవాలి. అలా రాసుకున్న తర్వాత గంటకు చల్లటి నీళ్లతో జుట్టును శుభ్రంగా కడిగేసుకోవాలి. తలకు షాంపును మాత్రం పెట్టుకోవద్దు. ఈ చిట్కాలు మీరూ ప్రయత్నించి చూడండి... మీ జుట్టును నిగనిగలాడేట్టు చేసుకోండి..