Sunday, February 5, 2017

Home remedies for perfect health

ఈ ఆరోగ్య చిట్కాలను పాటిస్తే ….. 40 జబ్బులు దూరం


ఈ ఆరోగ్య చిట్కాలు పాటించండి ….. నలభై జబ్బులను దూరం చేసుకోండి

• నేతిలో వేయించిన వెల్లుల్లిపాయలు ఆహారమునందు ప్రతిదినము నియమపూర్వకంగా తినినచో జీవశక్తి,
ఆయుర్దాయము పెరుగును.

• ప్రతిరోజూ వామురసము పుచ్చుకొనుచుంటే గుండెనొప్పి హరించును.

• రోజుకు రెండు ఆకుల చొప్పున సరస్వతీ ఆకులు తింటూ ఉంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దానిమ్మపండ్ల రసం తీసుకుంటే రక్త వృద్ధి, శుద్ధి అగును.

• పెద్ద ఉసిరికాయలు ఎండబెట్టి వరుగులుగా అయిన తరువాత పట్టుతేనెలో నానబెట్టి 6 మాసములు ఊరిన తర్వాత రోజూ ఒకటి తినుచుండిన రక్తపోటు, హృదయకోశ వ్యాధులు దరిచేరవు. ఎంతటివారికైనా మంచి చురుకుదనము వచ్చు.

• బొల్లి నివారణకు బాదంచాల గింజల గంధము, ప్రతతాళక చూర్ణము కలిపి మచ్చలపై పూయాలి.

vegge
• మునగ ఆకు రసము, మునగ ఆకుతో వండిన వంటకములు తింటే రోగములు హరించును.

• ప్రతిదినము తేనె, అల్లపురసం కలిపి తాగిన రక్తశుద్ధి, మెదడుకు సంబంధించిన వ్యాధులకు నివారణ జరుగును.

• తులసిఆకు పసరు, తేనె కలిపి త్రాగిన సర్వ కఫములు హరించును.

• దెబ్బలకు, పైనుండి పడుట వలస కలిగిన నొప్పులకు శిలాజిత్తు పాలతో కలిపి తీసుకోవాలి.

• గుంటకన్నాకు, మిరియాలు నూరి మాత్రలు చేసి సేవించిన వాతావరణ మార్పులవల్ల వచ్చే జ్వరాలు తగ్గును.

• ఆకుకూరలు, అరటిపళ్ళు, బంగాళాదుంపలు, తులసిఆకులు బీపీ తగ్గించును.

• రాత్రి పడుకోవడానికి ముందు చిమ్మిలి(నువ్వులతో చేసినది) తింటే మలబద్ధకం హరిస్తుంది.

• అల్లపురసం తాగితే అజీర్ణం, మలబద్ధకం తగ్గుతాయి. వాటివల్ల వచ్చే తలపోటు తగ్గుతుంది.

• అన్నం మొదటి ముద్ద వాము వేయించి నేతిలో తింటే ఆకలి పుడుతుంది. అజీర్ణం పోతుంది.

• గోరుచుట్టుకు పచ్చి పసుపుదుంప మెత్తగా నూరి వేలిపై పూసి మధ్యమధ్యలో తడుపుతూ ఉండే బాధలు తగ్గి నయమగును.


• అరటిదూట రసం సర్వరోగ నివారిణి.

• మెంతులు, మెంతికూర ఎక్కువవాడిన చక్కెరవ్యాధి తగ్గును.

• తెలగపిండి ఆకు రసం రోజూ ఒక తులం సేవిస్తే మూత్రపిండాలలో రాళ్ళు కరిగిపోతాయి.

• వేడినీటిలో తేనె కలిపి తాగుతూ ఉండే స్థూలకాయం తగ్గుతుంది.

• కుంకుడుకాయ రసం(నురుగు) వెచ్చచేసి రెండు ముక్కుల్లోనూ వేస్తే పార్శ్వనొప్పి పోతుంది.

• నువ్వులనూనెను వెచ్చచేసి అందులో కర్పూరం కలిపి అరికాళ్ళకు మర్దనా చేస్తే సుఖ నిద్ర కలుగుతుంది.

• కోడిరెట్ట కుక్కకాటుపై పూసిన విషము హరించును.

• తెల్లవిష్ణుకాంత, నల్ల విష్ణుక్రాంత వేర్లను కలిపినూరి లేపనము చేసిన కుష్ఠువ్యాధి హరించును.

• చెంగల్వకోష్ఠు, మందారపువ్వులు నూనెయందు ఉడికించి రాసిన పేను కొరుకుడు తగ్గుతుంది.

• నల్లి రక్తం రాసిన పేనుకొరుకుడు తగ్గి జుట్టు వస్తుంది.

• మందారపువ్వులను కపిలగోవు మూత్రంతో నూరి తలకు పట్టించిన వెంట్రుకలు ఊడుగ ఆగి కొత్త వెంట్రుకలు పెరుగును.

• నేల ఉసిరికాయల పసరు మజ్జిగలో కలిపి తీసుకున్న పచ్చకామెర్లు తగ్గును.

• ముల్లంగి ఉదయాన్నే పటికిబెల్లంతో కలిపి తింటే పచ్చకామెర్లు తగ్గును. గసగసాల చూర్ణం రెండు చెమ్చాలు మొదటిముద్దలో తింటే రక్త విరోచనాలు తగ్గుతాయి.

• ముడినువ్వులు, తాటిబెల్లం చిమ్మిలి చేసి తింటే షుగరు తగ్గుతుంది.

• కాకరాకు పసరు త్రాగితే కడుపులోని పురుగులు పోతాయి.

• జీలకర్ర నమిలి రసం మింగితే వికారం, వాంతులు తగ్గుతాయి.

• యాలకులు తింటే మూత్ర విసర్జన సమంగా జరుగుతుంది.

• రొంపభారమునకు పసుపు ఆవిరిపట్టిన తగ్గును. ఖాళీకడుపుతో ఆవిరిపట్టాలి.

• దాల్చినచెక్క రోజూ తింటే జ్ఞాపకశక్తి పెరుగును.

• మామిడి ఆకులు రోజూ నమిలితే నోటి వ్యాధులు తగ్గును.

• మాచికాయ గంధం రాస్తే నోటిపూత తగ్గును.

• మజ్జిగ అన్నంలో నీరుల్లి తింటే నరములకు సత్తువ కలుగును.

• ముల్లంగి దుంపపై ఉప్పు చల్లి తేలుకుట్టిన చోట పెడితే విషము హరించును.

• క్యారట్ రోజూ తింటే కంటి వ్యాధులు రావు.

• క్యాబేజీ తింటే కడుపులోని పుండ్లు తగ్గును. కంతి ఉంటే తగ్గును

Thursday, February 2, 2017

Tech mahindra 2017 holidays list


Tech mahindra released holidays list for the year 2017. They announced list of holidays based on the location. for more information please click on the below link


Click Here : Tech mahindra 2017 holidays list


.