Showing posts with label Health Tips. Show all posts
Showing posts with label Health Tips. Show all posts

Thursday, August 1, 2019

Breastfeeding and diet. Diet and Nutrition Tips for Breastfeeding Mothers (బాలింతకు ఆహార)

పాలిచ్చే ప్రతి తల్లికీ బోలెడు సందేహాలు. పాపాయికి సరిపడా పాలు పడాలంటే...  ఏం తినాలి, ఏం తినకూడదు...  ఇలా ఎన్నో ఉంటాయి. ఈ సమయంలో ఆహారపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే అదనంగా కెలొరీలు అందేలా చేసుకోవాలి.  అదెలాగో తెలుసుకుందామా...
బాలింతకు ప్రత్యేకించి  ఇనుము, క్యాల్షియం, పొటాషియం, విటమిన్‌ ఎ, డి వంటి పోషకాలు అవసరం అవుతాయి .ఇవి తల్లిపాల ఉత్పత్తిని పెంచుతాయి. అదనంగా 600 కిలో కెలొరీలు అవసరం. అసలు ఏ పదార్థాలు తీసుకోవాలంటే...

* ఓట్‌మీల్‌: ఇందులో అధికమొత్తంలో ఇనుము లభిస్తుంది. ఇది ప్రసవం అయ్యాక వచ్చే రక్తహీనతను నిరోధించడానికి చాలా అవసరం. రక్తహీనత ఉంటే పాల ఉత్పత్తి తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇనుము రక్తంలోని ఎర్రరక్తకణాల ఉత్పత్తినీ పెంచుతుంది. ఇది క్రమంగా తల్లిపాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఇనుము కోసం బెల్లం, ఖర్జూరాలూ తీసుకోవడం మంచిది.
* వెల్లుల్లి: బాలింతల్లో పాలు పెరిగేందుకు ఇది ఎంతో తోడ్పడుతుంది. దీంతో ఇతరత్రా ఆరోగ్య ప్రయోజనాలూ ఎక్కువే. సాధారణంగా పసిపిల్లల్లో గ్యాస్‌ సమస్య వల్ల కడుపు నొప్పి వస్తుంది. దీనిని నివారించడంలో వెల్లుల్లి కీలకంగా పని చేస్తుంది.

* పచ్చి బొప్పాయి:  ఇది శరీరంలో ఆక్సిటోసిన్‌ ఉత్పత్తిని పెంచి పిల్లలకు సరిపడా పాలు వృద్ధి చెందేలా చేస్తుంది. దీన్ని ఉడికించి కూర రూపంలో తిన్నా, అలానే సలాడ్‌ రూపంలో తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. థాయ్‌ రెస్టారంట్‌లలో దీన్ని ఎక్కువగా వాడతారు.

* పండ్లు: వీటిల్లో అధికమొత్తంలో పోషకాలు లభిస్తాయి. ఇవి మలబద్ధకాన్ని నిరోధిస్తాయి. రోజూ కనీసం రెండు కప్పుల పండ్ల ముక్కలను తినగలిగితే మంచిది. అరటి, మామిడి, తర్బూజా వంటి పండ్లను తీసుకోవడం వల్ల పొటాషియం, విటమిన్‌ ఎ అధికమోతాదులో లభిస్తాయి.

*కూరగాయలు, ఆకుకూరలు:  బాలింత తన ఆహారంలో కూరగాయల మోతాదుని పెంచాలి. వీటిల్లో కీలకమైన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు...ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పాలకూర, ఇతర ఆకుకూరలు, క్యారెట్లు, చిలగడదుంప, గుమ్మడి, టొమాటోలు, తృణధాన్యాల వంటివి  పాల ఉత్పత్తిని పెంచుతాయి. పాలకూరలో ఎక్కువగా ఇనుము ఉంటుంది. దీన్ని ఉడికించి తినడం మంచిది. పాల ఉత్పత్తిని పెంచడంలో క్యారెట్‌ ఒకటి. దీనిలో ఎక్కువ మొత్తంలో లభించే విటమిన్‌ ఎ పాపాయి ఎదుగుదలలోనూ కీలకంగా పనిచేస్తుంది.

*మెంతులు: ఈ గింజల్ని నీటిలో మరిగించి టీలా తాగడం మంచిది.

* నట్స్‌: వీటిని తినడం వల్ల శరీరంలో సెరటోనిన్‌ స్థాయులు పెరుగుతాయి. ఇది తగినన్ని తల్లిపాలు తయారవడానికి సాయపడుతుంది.

* పాలిచ్చేటప్పుడు శరీరానికి అదనంగా ఇరవైఐదు గ్రాముల వరకూ మాంసకృత్తులు ప్రతిరోజూ అవసరం అవుతాయి. అందుకోసం బీన్స్‌, బఠాణీలు, నట్స్‌, గింజలు, పాలు వంటివి తీసుకోవాలి. మాంసాహారులైతే చేపలు, కీమా వంటివి తినొచ్చు. సముద్ర ఆహారం తీసుకోవడం వల్ల పాపాయి మెదడు చక్కగా వృద్ధి చెందుతుంది. అందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కీలకంగా పనిచేస్తాయి.
ఇవి వద్దు
పిల్లలకు పాలిచ్చే సమయంలో తీసుకోకూడని పదార్థాలూ ఉన్నాయి. అవేంటంటే...!

* కృత్రిమ తీపిని అందించే పదార్థాలను, చాక్లెట్లను తినకూడదు. మసాలా దినుసులకు ఈ సమయంలో దూరంగా ఉండటమే మంచిది.

* పుల్లటి పండ్లను  తీసుకోకూడదు. నీ అధికమోతాదులో టీ, కాఫీలు తాగడం వల్ల వాటిల్లో ఉండే కెఫీన్‌ పాపాయి నిద్రకు భంగం కలిగిస్తుంది. సోడాలు, టీలకూ దూరంగా ఉండాలి.

Wednesday, August 24, 2016

Medical Camp conducting on 11th September 2016 in Our Dharmavaram Under Geetha Mullapudi Dental Hospital, Rajahmundry.

Hai all.. This is message from Dr. Mullapudi Rajendra Prasad​  and Sangeetha Rajendra Prasad​, Geetha Mullapudi Dental Hospital, Rajahmundry.

The hospital management has planning to conduct mega medical camp and dental camp on 11 th September 2016 (Sunday)  at #OurDharmavaram to meet the medical and dental needs of people of our region ... this camp includes consultation and free treatment and free medicines distribution.... On the day of Vinayaka chathurdhi we will sit at panchayat office and decide our plan of action about camp... Waiting to see u all on 5 th September ...


all the following specialties will be included in our camp ....

General medicine,
Cardiaology ,
Nephrology,
Orthopaedic,
Neurology,
Ophthalmology,
Dental,
ENT too... We need all our peoples help to coordinate the camp ....

we request all our supporters, youth members and people from #dharmavaram to participate in this event and make it grand success... and forward this message to all our friends and our villagers. Any suggestions or any plans regarding this event please welcome and share your views with us...



Have a great day ..


For more information conatct

Dr Rajendra Mullapudi,
Contact: 9848054054.
(or)
https://www.facebook.com/manadharmavaram/

Tuesday, August 4, 2015

How to reduce white hair problem in early age

Solution for white hair 

చిన్నవయసులోనే కొంతమంది యువతీయువకులకి తలలో తెల్ల వెంట్రుకలు వస్తుంటాయి. ఇలాంటి పిల్లలు తెల్లబడిన జుట్టుతో బయటకు వెళ్లాలన్నా, నలుగురితో కలిసి తిరగాలన్నా బాగా మొహమాటపడతారు. తమ వెంట్రుకల రంగు చూసి ఎవరు నవ్వుతారో...వెక్కిరిస్తారోనని భయపడుతుంటారు. చాలా ఇబ్బందిపడుతుంటారు. ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. చిన్నతనంలోనే తెల్ల వెంట్రుకలు రావడానికి కారణాలు లేకపోలేదు. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, తీవ్రమైన ఒత్తిడితో కూడిన జీవనశైలి వంటి వాటి వల్ల జుట్టు తెల్లబడుతుంది. ఇవే కాకుండా వయసు మీద పడ్డా కూడా నల్లగా ఉన్న జుట్టు కాస్తా తెల్లబడుతుంది. దీనికి కారణం జుట్టును నల్లగా ఉంచే మెలొనిన్‌ ఉత్పత్తి శరీరంలో తగ్గిపోవడమే. ఈ తెల్లజుట్టు కనిపించకుండా కొన్నిరకాల టిప్స్‌ , ట్రిక్స్‌ ఉన్నాయి. అవి చిన్నాపెద్దా అందరికీ ఉపయోగపడతాయి. ఉదాహరణకు శిరోజాల్లో ఏవో కొన్ని పాయలు తెల్లగా ఉన్నాయనుకోండి ఆ ప్రాంతంలో కొద్దిగా మస్కారా రాసుకుంటే జుట్టులోని తెల్లదనాన్ని మస్కారా కవరప్‌ చేస్తుంది. ఇది ఇన్‌స్టాంట్‌ కిటుకు. అలాగే కాజల్‌ని కూడా తెల్ల వెంట్రుకలపై పూస్తే జుట్టు నల్లగా నిగ నిగలాడుతూ కనిపిస్తుంది. డార్క్‌ బ్రౌన్‌ లిప్‌స్టిక్‌ను కూడా తలలోని తెల్ల పాయాలపై అప్లై చేయొచ్చు. ఇవే కాకుండా ఇంట్లో వస్తువులతో కూడా తెల్లజుట్టు సమస్యను అధిగమించవచ్చు. ఎలా అంటారా? 

ఉదాహరణకు 100 మిల్లీ గ్రాముల కొబ్బరినూనెలో గుప్పెడు కరివేపాకు ఆకులు వేయాలి. ఆ రెండింటిని కలిపి బాగా ఉడకబెట్టాలి. కరివేపాకు ఆకులు నల్లరంగులోకి మారిన తర్వాత దానిని పొయ్యి మీద నుంచి దించాలి. అది చల్లారిన తర్వాత దాన్ని బాగా పిండి అందులోంచి వచ్చిన ఆయిల్‌ని ఒక సీసాలో పోసి గట్టిగా మూతపెట్టాలి. ఈనూనెను ప్రతి రోజూ రాత్రిపూట తలకు రాసుకుని 20 నిమిషాలు పాటు మర్దనా చేసుకొని, ఆ మర్నాడు తలస్నానం చేయాలి. జుట్టును నల్లగా ఉంచడంలో ఉసిరి, నిమ్మ కూడా ఎంతో బాగా పనిచేస్తాయి. ఒక టీ స్పూన్‌ ఉసిరిపొడిని కప్పు నీళ్లల్లో కలిపి స్టవ్‌పై పెట్టి అది సగానికి వచ్చేవరకూ ఉడకనివ్వాలి. తర్వాత దానిని స్టవ్‌ మీద నుంచి దించి అందులో మూడు టీస్పూన్ల నిమ్మరసాన్ని కలపాలి.
ఈ మిశ్రమానికి కొంత నీరు కలిపి తలకు బాగా రుద్దుకుని నీళ్లతో కడిగేసుకోవాలి. 

అలాగే నువ్వుల నూనె కూడా జుట్టు నల్లగా నిగ నిగ లాడేలా చేస్తుంది. వంద మిల్లీగ్రాముల నువ్వుల నూనె, 100 మిల్లీ గ్రాముల కమలాపండు రసం, 50 గ్రాముల మెంతుల పొడిని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మూడు వారాల పాటు సూర్యరశ్మి కింద ఉంచాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలకు పెట్టుకుంటే జుట్టుకున్న తెల్లదనం పోతుంది. హెన్నాతో సైతం ఈ సమస్యను అధిగమించవచ్చు. హెన్నా పొడిని పేస్టులా చేసి అందులో కాస్తంత కాఫీ పొడి, ఒక టేబుల్‌ స్పూన్‌ పెరుగు, ఒక టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఆ పేస్టును తలకు రాసుకుని రెండు గంటల సేపు అలానే ఉంచుకోవాలి. ఆ తర్వాత షాంపుతో తలరుద్దుకుని, నీళ్లతో జుట్టును శుభ్రంగా కడిగేసుకోవాలి. ఉడకబెట్టిన తేయాకు ఆకులతో వెంట్రుకల తెల్లదనాన్ని పోగొట్టుకోవచ్చు. తొలుత తేయాకు ఆకుల్ని నీళ్లల్లో ఉడకబెట్టాలి. అది చల్లారిన తర్వాత ఆ ఆకుల్ని పిండి దాని నుంచి వచ్చే నీటిని తలకు రాసుకోవాలి. అలా రాసుకున్న తర్వాత గంటకు చల్లటి నీళ్లతో జుట్టును శుభ్రంగా కడిగేసుకోవాలి. తలకు షాంపును మాత్రం పెట్టుకోవద్దు. ఈ చిట్కాలు మీరూ ప్రయత్నించి చూడండి... మీ జుట్టును నిగనిగలాడేట్టు చేసుకోండి..

Friday, April 3, 2015

How To Remove or Reduce Fat From Our Body :


Health Tip : Here are 10 Foods That Burn Fat




1. Oats : Its not only tastes great but also reduces your hunger. Oats contains fiber which helps and stabilizes the levels of cholesterol.


2. Eggs : Eggs are the rich sources of proteins and low in calories. Eggs helps us to build the muscles and develops the good cholesterol.


3. Apples : Apples are enriched with powerful antioxidants and other supplements. Most importantly it contains Pectin which helps to reduce the fat cells in the body.

4. Green Chillies : Green chillies contains Capsaicin which helps to develop the body growth cells and burns the calories in quick time.

5. Garlic : Garlic contains Allicin which has anti-bacterial properties helps us to reduce the fat and removes the bad cholesterol.

6. Honey : Honey is the best one to burn fat. Add honey in warm water and take it daily in the early morning.

7. Green Tea : Green Tea is the most effective one which helps you to lose weight. It contains Antioxidants which helps and stabilizes our body weight.Take daily 2 cups of tea for a better results.

8. Wheat Grass : It boosts our metabolism and helps to reduce the fat.

9. Tomatoes : Tomatoes helps us to burn the fat in quick time. It also helps us to stay away from cancer. So Take tomatoes in your diet regularly.

10. Dark Chocolate : Dark chocolate contains Flavonoids, anti-inflammatory properties which helps to reduce the cholesterol levels in the blood. It boost the growth of serotonin in the blood and also burns the fat.